సైమా అవార్డ్స్ 2019

2019-08-16 14:01:57

దోహా ఖతార్‌లో జరుగుతున్న సౌథ్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ (సైమా) వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది.   ఈ వేడుకలో ఎందరో ప్రముఖులు సందడి చేశారు. తెలుగు, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులకు అవార్డులు ప్రదానం చేశారు. వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి,మోహన్ లాల్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. దక్షిణ భారత సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు కీర్తి సురేశ్‌, రాధిక, శ్రియ, పాయల్‌ రాజ్‌పుత్‌, యశ్‌, విజయ్‌ దేవరకొండ తదితరులు హాజరయ్యారు. ఈ అవార్డ్ వేడుకకు ప్రముఖ యాంకర్‌ సుమ, నటుడు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. 

 

ఈ సారి సైమా అవార్డు వేడుకలో రంగస్టలం ఏకంగా తొమ్మిది అవార్డులను గెలుచుకుంది. మహానటి, అర్.ఏక్స్ - 100 లకు మూడేసి చొప్పున అవార్డులు వచ్చాయి.


సైమా అవార్డు విజేతలు వీరే


ఉత్తమ నటుడు: రామ్‌చరణ్‌ (రంగస్థలం)

ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌ (మహానటి)

ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (రంగస్థలం)

ఉత్తమ పరిచయ నటుడు: కల్యాణ్‌ దేవ్‌ (విజేత)

ఉత్తమ పరిచయ నటి: పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)

ఉత్తమ పరిచయ దర్శకుడు: అజయ్‌ భూపతి (ఆర్‌ ఎక్స్‌ 100)

ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్రప్రసాద్‌ (మహానటి)

ఉత్తమ సహాయ నటి: అనసూయ భరద్వాజ్‌ (రంగస్థలం)

ఉత్తమ నటుడు (క్రిటిక్‌): విజయ్‌ దేవరకొండ (గీత గోవిందం)

ఉత్తమ నటి (క్రిటిక్‌): సమంత (రంగస్థలం)

ఉత్తమ హాస్యనటుడు: సత్య (ఛలో)

ఉత్తమ ప్రతినాయకుడు: శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)

ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌(రంగస్థలం-  ఎంత సక్కగున్నావే)

ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కులకర్ణి (ఆర్‌ ఎక్స్‌ 100- పిల్లారా.. పాట)

ఉత్తమ గాయని: ఎం.ఎం మానసి (రంగస్థలం- రంగమ్మా..మంగమ్మా పాట)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రత్నవేలు (రంగస్థలం)

ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: మౌనిక రామకృష్ణ (రంగస్థలం)

పాపులర్‌ సెలబ్రిటీ ఆన్‌ సోషల్‌మీడియా: విజయ్‌ దేవరకొండ