సెన్సార్ పూర్తి చేసుకున్న తిప్పరా మీసం యూ / ఎ సర్టిఫికేట్ జారీ : నవంబర్ 8 విడుదల

2019-11-06 03:46:07

విష్ణు, నిక్కి తంబోలి హీరో హీరోయిన్లుగా కృష్ణ విజయ్‌ ఎల్ దర్శకత్వంలో  తెరకెక్కిన సినిమా తిప్పరా మీసం.  ఈ సినిమా నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 

కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కృష్ణ విజయ్‌ ఎల్‌ దర్శకత్వంలో తిప్పరా మీసం అనే టైటిల్‌తో తెరకెక్కిన సినిమాలో డిఫరెంట్‌తో ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డ్ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. శ్రీ విష్ణు సరసన నిక్కీ తంబోలి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సురేష్‌ బొబ్బిలి సంగీతమందిస్తున్నాడు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి దర్శకుడు కృష్ణ విజయ్‌ ఎల్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇటీవల సినీ ప్రముఖులు అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హీరో నారా రోహిత్, ప్రముఖ నిర్మాత యం యల్ కుమార్ చౌదరి, తిప్పరా మీసం టీం హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నిక్కి తంబోలి, దర్శకుడు కృష్ణవిజయ్.ఎల్, నటుడు, సమర్పకుడు అచ్యుత రామారావు, నటుడు బెనర్జీ, నటి రోహిణి, రవిప్రకాష్, రవివర్మ , కమేడియన్ నవీన్, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఎడిటర్ ధర్మేంద్ర, పాటల రచయిత పూర్ణచారి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా తొలి టిక్కెట్ ని వినాయక్, రోహిత్ కొనుగోలు చేశారు.