నవంబర్ 15న 'విజయ్ సేతుపతి' విడుదల

2019-11-06 13:34:48

విజయ్ సేతుపతి హీరోగా విజయ్ చందర్  దర్శకత్వంలో నటించిన చిత్రం ‘సంగ తమిళన్‌’. ఈ సినిమాను తెలుగులో విజయ్ సేతుపతి అనే పేరుతో అనువదించారు. రాశీఖన్నా, నివేదా పెత్తురాజ్ లు కథానాయికలు. విజయా ప్రొడక్షన్స్ బ్యానరుపై భారతిరెడ్డి దీనిని నిర్మించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే బిగిల్, ఖైదీ చిత్రాలు బరిలో ఉండడం, ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కకపోవడంతో విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇందులో విజయ్ సేతుపతి పోలీసు అధికారిగా నటిస్తున్నారు. పక్కా మాస్ కమర్షియల్ చిత్రంగా దీన్ని రూపొందించినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని పేర్కొన్నాయి. ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ జనాల్లో మరింత క్రేజీ సంపాదించుకోవాలని విజయ్ సేతుపతి భావిస్తున్నారు.